Nara lokesh anantpuram tour update: ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల రాజ్యం నడుస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రజలు తిరగడతారనే భయంతో.. పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం జగన్ పాలన చేస్తున్నారని.. తప్పులను ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని.. ఆఖరికి విద్యార్థులను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసేంత తప్పేం చేశారని లోకేష్ ప్రశ్నించారు.
అనంతపురం (anantapuram)లో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు ఆందోళన చేస్తున్న సమయంలో.. వారిపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఎస్బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టి.. రాష్ట్ర ప్రభుత్వం (AP Government) చదువులను వ్యాపారం చేస్తోందని నినాదాలు చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారికి అండగా నిలబడేందుకు లోకేష్ ఇవాళ అనంతపురం వచ్చారు.
కర్నూలు జిల్లా అలంపూర్ చెక్ పోస్ట్ దగ్గర నుంచే నారా లోకేష్ కి కార్యకర్తలు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరు ఆయన అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలకు చేరుకున్నారు. అయితే అడుగుడుగునాపోలీసులు లోకేష్ కు ఆంక్షలు పెట్టారు. నిబంధన పేరుతో లోకేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు ... ఆందోళన విరమించాలంటూ విద్యార్థులను హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్ వస్తే విద్యార్థులను కలిసి ఆందోళనలో పాల్గొంటే పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుందని పోలీసులు ముందస్తుగానే విద్యార్థులను అక్కడి నుంచి తలరించేందుకు ప్రయత్నం చేశారు..
అయితే విద్యార్థులకు అండగా టీడీపీ నేతలు కూడా ఆందోళను చేశారు. దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని అప్పటి వరకు వెనక్కు తగ్గేది లేదని విద్యార్థులు చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ నేత లోకేష్ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు నారా లోకేష్. ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని ఖండిస్తూ విద్యార్థులకు అండగా ఉండేందుకు వెళ్తే తన పర్యటనను అడ్డుకోవడం దారుణమన్నారు.
లోకేష్ తో పాటు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీలు, పాఠశాలల ఆస్తులను ఖాజేయడానికే కుట్ర పన్నిందనొ కాల్వ మండిపడ్డారు. . ఏపీలో పేదల విద్య బలైపోతుంది.. ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం కోసమే ఈ కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలల తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రభుత్వం తీరని క్షోభను కలుగజేస్తుందని ఆరోపించారు.