తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దూకుడు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేస్తున్నారు.
2/ 5
శనివారం సూళ్లూరుపేట బస్టాండు కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వేళ వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆదుకుందా అని ప్రశ్నించారు.
3/ 5
వైసీపీ ప్రభుత్వం పాలన పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
4/ 5
బాబాయి హంతకులను కాపాడే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. వివేకా హత్య కేసు నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు
5/ 5
లోకేశ్ సవాలు చేస్తే జగన్ భయపడి తోకముడిచారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగదని చంద్రబాబు మండిపడ్డారు.