TDP CHIEF CHANDRABABU NAIDU CANCELS VIZIANAGARAM TOUR ONCE AGAIN DUE TO CAPITAL STIR EFFECT AK
డైలమాలో చంద్రబాబు... మరోసారి ఆ జిల్లా టూర్‌కు డుమ్మా...
ఎన్నికల ఫలితాల తర్వాత కోలుకున్న టీడీపీ నేతలు తమ జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో వాయిదా పడ్డ విజయనగరం టూర్‌ను జనవరిలో ఖరారు చేశారు.
తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
2/ 16
ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విషయాలు కొంత కాలం పక్కనపెట్టి, అమరావతి రైతుల తరఫున పోరాటం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
3/ 16
అందుకే విజయనగరంలో రెండు రోజుల పాటు సాగాల్సిన తన పర్యటనను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు.
4/ 16
రాజధాని విషయంలో టీడీపీ నేతల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వచ్చేందుకు చంద్రబాబు సంకోచిస్తున్నారని కొందరు అంటున్నారు. అందుకే విజయనగరం జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి.
5/ 16
గతంలోనే జిల్లాల పర్యటనల్లో భాగంగా విజయనగరానికి రావాల్సిన చంద్రబాబు... మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అనారోగ్యం కారణంగా వాయిదా వేసేశారు.
6/ 16
అశోక్ గజపతిరాజు శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోవడంతో... ఆయన లేకుండా పర్యటించడం సరికాదనుకుని రాలేదు.
7/ 16
తాజాగా జనవరి 3, 4 తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో అది కూడా రద్దయిందని అంటున్నారు.
8/ 16
విశాఖ రాజధాని విషయంలో టీడీపీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న కారణంగానే బాబు పర్యటన రద్దయిందన్న వానదలు వినిపిస్తున్నాయి.
9/ 16
ఎన్నికల తర్వాత జిల్లావైపు చంద్రబాబు రాలేదు. ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి రాలేక సొంత వ్యవహారాలకే పరిమితమైపోయారు.
10/ 16
ఎన్నికల ఫలితాల తర్వాత కోలుకున్న టీడీపీ నేతలు తమ జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో వాయిదా పడ్డ టూర్‌ను జనవరిలో ఖరారు చేశారు.
11/ 16
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం పార్టీ పరిస్థితి ఏంటో చూసుకోవాలి. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని భావించారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి.
12/ 16
రాజధాని వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనతో టీడీపీ నేతలు గందరగోళంలో పడ్డారు. దీనిపై మౌనంగా ఉండిపోయారు.
13/ 16
కొందరు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంటే... మరి కొంతమంది ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖను రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు తీర్మానం కూడా చేశారు.
14/ 16
దీనికి విజయనగరం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారిందంటున్నారు.
15/ 16
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పర్యటనకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చంద్రబాబు భావించారని సమాచారం. అందుకే పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. విశాఖ రాజధాని అంశాన్ని కాదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని జిల్లా నేతలు చెబుతున్నారు.
16/ 16
మొత్తానికి విజయనగరంలో అధినేత పర్యటిస్తే ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేమని, అందుకే టూర్ వాయిదా వేసుకుంటే బెటర్ అని అధిష్టానానికి స్థానిక నేతలు చెప్పారని టాక్. అందుకే చంద్రబాబు టూర్ మరోసారి వాయిదా పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.