SONU SOOD SAYS MALAVIKA WILL BE RESPECTED BY THE PEOPLE OF MOGA CONSTITUENCY IN THE PUNJAB ELECTIONS AS SHE WANTS TO DO PUBLIC SERVICE FROM THE BEGINNING SNR
పంజాబ్ ఎన్నికల్లో మాళవిక విక్టరీ గ్యారెంటీ..సిస్టర్‌కి సోనుసూద్ ఫుల్ సపోర్ట్
Punjab elections: నా సోదరి మాళవిక సూద్‌కి ప్రజాసేవ చేయాలన్న తపన ఎక్కువ అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు సినీ నటుడు సోనుసూద్. సామాజికసేవ చేసే ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ కాబట్టి మోగా ప్రజలు ఆమెను ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాని చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసిన సినీ ప్రముఖులు ఉన్నారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటూనే ప్రజలకు సేవ చేస్తూ అంతకంటే గొప్ప స్థాయికి ఎదిగారు యాక్టర్ సోను సూద్.
2/ 6
జనంలో ఆయనకున్న ఆదరణ చూస్తే ఖచ్చితంగా సోనుసూద్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి విరుద్దంగా ఆయన సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
3/ 6
ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాళవిక సూద్ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గం నుంచి నిలబడుతున్నారు. అక్కడ ఆమె విజయం సాధిస్తారా లేక ఫలితాలు ప్రతికూలంగా వస్తాయా అనే ప్రశ్నలపై నటుడు సోనుసూద్ స్పందించారు.
4/ 6
ఖచ్చితంగా మాళవిక సూద్‌ను ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు సోనుసూద్. మొదటి నుంచి సామాజిక సేవ చేసే కుటుంబంలో పుట్టడం వల్ల తన సోదరి ప్రజల అవసరాలను దగ్గరగా చూసిందన్నారు.
5/ 6
తన తల్లిదండ్రులు సామాజిక సేవ చేసిన వాళ్లేనని, ఎన్నో పాఠశాలలు, ధర్మశాలు కట్టించిన విషయాన్ని చెప్పారు సోనుసూద్. వాళ్ల స్పూర్తితోనే తన సోదరి మాళవిక సూద్ మోగాలో చాలా మంచి పనులు చేపట్టినట్లుగా వెల్లడించారు.
6/ 6
సామాజిక సేవ చేసే వాళ్లకు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు సోనుసూద్. మాళవిక సూద్ లాంటి వాళ్లు ఎన్నికైతేనే ప్రజలకు అన్నీ విధాలుగా మేలు జరుగుతుందన్నారాయన. మోగాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడంలో తన సోదరి పాత్ర ఎంతో ఉందన్నారు.