సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికైన సందర్భంగా కిషన్ రెడ్డి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఐతే తనను కలిసేందుకు వచ్చే నేతలు, అభిమానులకు వినూత్న విజ్ఞప్తి చేశారు. పూలదండలు, బొకేలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని సూచించడంతో.. అభిమానులు పెద్ద ఎత్తున పుస్తకాలు తీసుకొస్తున్నారు. వాటిని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాల్లో పంచుతున్నారు కిషన్ రెడ్డి.