R PRIYA SWORN IN AS THE FIRST DALIT WOMAN MAYOR OF CHENNAI MUNICIPAL CORPORATION SNR
Tamilnadu:సామాన్యులకే రాజ్యాధికారం..చెన్నై మహానగరానికి దళిత మహిళ మేయర్
Chennai Dalit woman mayor: చెన్నై మహానగర పాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ ఆర్. ప్రియ బాధ్యతలు స్వీకరించారు. 29ఏళ్ల వయసులో మేయర్ అయిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కారు. చెన్నై మేయర్ పదవి చేపట్టిన మూడో మహిళ ఆర్. ప్రియ కావడం విశేషం.
తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఆర్. ప్రియ అనే ఓ దళిత మహిళ ప్రమాణస్వీకారం చేసింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరపాలక సంస్థకు మేయర్‌గా దళిత మహిళ ఎన్నికవడం ఇదే మొదటి సారి.
2/ 11
29సంవత్సరాల ఆర్. ప్రియ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార డీఎంకే తరపున నిలబడి భారీ మెజార్టీతో కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
3/ 11
ఈ ఏడాది జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ఆర్. ప్రియ ఒకరు. ప్రస్తుతం చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అతి పిన్న వయస్సురాలిగా ఆర్. ప్రియ రికార్డులకెక్కారు.
4/ 11
ఇప్పటి వరకు చెన్నై నగరపాలక సంస్థకు ముగ్గురు మహిళలు మాత్రమే మేయర్లుగా కొనసాగారు. ప్రస్తుతం మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన దళిత మహిళ ఆర్. ప్రియ మూడో మహిళ కావడం విశేషం.
5/ 11
ఆర్. ప్రియ కంటే ముందు చెన్నై మేయర్లు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ పనిచేశారు. వారి తర్వాత స్థానంలో దళిత మహిళ అందులో అతి పిన్నవయస్కురాలు ఆర్. ప్రియ కావడం గొప్ప విశేషం.
6/ 11
జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల పోటీల్లో కౌన్సిలర్లుగా గెలిచిన వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎం తరపున తీనాంపేట 98వ వార్డు నుంచి గెలిచింది 21సంవత్సరాల ప్రియదర్శిని.
7/ 11
జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల పోటీల్లో కౌన్సిలర్లుగా గెలిచిన వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎం తరపున తీనాంపేట 98వ వార్డు నుంచి గెలిచింది 21సంవత్సరాల ప్రియదర్శిని.
8/ 11
74వ వార్డు అయిన తిరువీకా నగర్ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్‌గా కూడా రికార్డ్ సృష్టించారు.
9/ 11
ఆర్.ప్రియ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయడంపై సీఎం స్టాలిన్, డీఎంకే నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
10/ 11
చెన్నై మేయర్‌గా దళిత మహిళ ప్రమాణస్వీకారం చేస్తే..అదే తమిళనాడులోని కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఆటో డ్రైవర్ 42ఏళ్ల శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
11/ 11
కే. శరవణన్ తుక్ కంపల్యామ్ స్ట్రీట్‌లో నివసించే సాధారణ ఆటో రిక్షా డ్రైవర్. డీఎంకే పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన శరవణన్ ఆదర్శనీయమైన రాజకీయ కుటుంబ నేపధ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు.