PUNJAB ASSEMBLY ELECTINS 2022 DELHI CM ARAVIND KEJRIWAL COSTUME WEAR BOY GOES VIRAL PAH
Punjab: ఛోటా కేజ్రీవాల్ .. సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారిన బాలుడి ఫోటోలు..
Punjab: ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హీట్ కొనసాగుతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. దేశంలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. ఆప్ కార్యకర్తలు పంజాబ్ లో విజయం సాధించడంతో ఆనందంలో మునిగి తేలారు. ఒక బాలుడు మరొసారి కేజ్రీవాల్ మాదిరిగా దుస్తులు ధరించి వైరల్ గా మారాడు.
పంజాబ్ లో ఆప్ విజయం సాధించింది. ఇక విజయోత్సవ ర్యాలీలో ఒక పిల్లవాడు మరోసారి వార్తలలో నిలిచాడు. అతను అరవింత్ కేజ్రీవాల్ మాదిరిగా దుస్తులు ధరించాడు.
2/ 5
ఆ పిల్లవాడు.. పసుపు రంగు పగిడి ధరించి.. కళ్లద్దాలుపెట్టుకున్నాడు. ఎరుపురంగు టీషర్ట్ ధరించి.. మెడలో మఫ్లర్ ధరించాడు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నాడు. అతడిని చూడటానికి చుట్టుపక్కల వారు ఆసక్తి చూపిస్తున్నారు.
3/ 5
బాలుడు.. కేజ్రీవాల్ మాదిరిగా మఫ్లర్ ధరించి, పగిడి వేసుకున్నాడు. తన తండ్రి అతడిని ఎత్తుకున్నాడు. వారు కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్నారు.
4/ 5
అయితే,ఇదే పిల్లవాడు.. గతంలోనే ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అప్పుడు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసేకార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పుడుకూడా ఇదే విధంగా మఫ్లర్ ధరించి సమావేశంలో పాల్గొన్నాడు.
5/ 5
ఇప్పుడు మరోసారి మఫ్లర్ ధరించి ఉన్న ఛోటా కేజ్రీవాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇతడిని చూసిన నెటిజన్లు.. ఛోటా కేజ్రీవాల్ అంటూ పిలుస్తున్నారు. ముద్దుగా ఉన్నాడని కామెంట్ లు పెడుతున్నారు.