Pawan on fire on Jagan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై.. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన.. పవన్ ఓ రేంజ్ లో ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు... ఇండియన్ రిపబ్లిక్... అని పేర్కొన్నారు. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో జనం బయటకు లాక్కొచ్చి కొడుతారు గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైతే రకరకాల కథనాలు వచ్చాయని... నిజానికి ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై కాకుండా సినిమా వాళ్ల జీవితాలపై కథనాలు ప్రసారం చేయకండి.. రాజకీయ నాయకుల క్రైమ్ పై ఫోకస్ చేయండి అంటూ సూచించారు.
తేజు ప్రమాదంపై కాదు మాట్లాడాల్సింది.... వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో మాట్లాడండి అన్నారు పవన్. ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి ఉంది... కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచినప్పుడు.. దాని వెనుక భారీ కుట్ర ఉందన్నారు.. ఆ కుట్ర ఏంటో అడగండి అన్నారు.. గిరిజనులకు పోడు భూముల సమస్య ఉంది.. వాటిపై మాట్లాడండి.. ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై మాట్లాడండి అన్నారు. ఇంకా స్పైసీగా ఉండాలంటే... వైసీపీ సానుభూతిపరులు వ్యభిచారాన్ని లీగలైజ్ చేయమని బయటకొచ్చారన్నారు. వాటిపై కథనాలు నడపండి. అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లపై మాట్లాడి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదో... దానిపై మాట్లాడండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు.... బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు... ఒక ఆడబిడ్డ బయటకు వెళ్తే క్షేమంగా ఎలా రావాలి.. ఇలాంటి అంశాలపై చర్చలు పెట్టండి అన్నారు పవన్..
సన్నాసి మంత్రి అంటూ సెటైర్
తేజు ఇంకా ఆస్పత్రిలో కళ్లు తెరవకుండా కోమాలో ఉన్నాడన్నారు పవన్. తేజు యాక్సిడెంట్ గురించి కాదు మాట్లాడాల్సింది.. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి అన్నారు. తెలంగాణలో థియేటర్లు ఉన్నాయని.. ఆంధ్రాలో లేవు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే... పవన్ కల్యాణ్ సినిమా ఆపేసినా, అతనొచ్చిన చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు ఆపేసినా.. భయపడి మనవద్దకు వస్తారని అనుకుంటున్నారని ఇది చాలా తప్పు అన్నారు. అరేయ్ సన్నాసుల్లారా... దద్దమ్మల్లారా.. ఒక హీరో గానీ, హీరోయిన్ గానీ రూ.10 కోట్లు తీసుకుంటే... అందులో 45శాతం ట్యాక్స్ కడుతారని గుర్తు చేశారు. అరేయ్ బాబు మేము అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు సంపాదించలేదు.. జనాలను ఎంటర్టైన్ చేసి సంపాదిస్తున్నాం.. రౌడీయిజం, గూండాయిజం చేస్తే తలవంచుకుని వెళ్లిపోతాం.. కానీ బతకనివ్వండి. అంటూ జల్సా సినిమా డైలాగ్ లను గుర్తు చేశారు.
మోహన్ బాబు పై పరోక్ష కౌంటర్లు..
నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడిని తాను అన్నారు. కిన్నెర మొఘులయ్య లాంటి వ్యక్తులను గుర్తించి సాయం చేశామన్నారు. అది తమ సంస్కారమన్నారు. ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లు ఉండాలనుకున్నప్పుడు నిర్మాతలు కూడా థియేటర్లు తమ చేతిలో పెట్టుకోవాలనుకోరా అని ప్రశ్నించారు. సంపద సృష్టి జరగకపోతే డబ్బులు ఎక్కడినుంచి వస్తాయన్నారు. అలాగే తనపై తాను కూడా సెటైర్లు వేసుకున్నారు. అభిమానులను ఉద్దేశిస్తూ మీరేమో పవర్ స్టార్ అంటారు... పవర్ లేనోడు పవర్ స్టార్ ఎలా అవుతాడు తీసేయండి అన్నారు. ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ప్రభుత్వం నియంత్రించడమేంటి. సినీ ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్... రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్‌కు అప్లై చేయరని నమ్మకం ఉందా..? ఆ స్కూల్‌ను జాతీయం చేసి... ఫీజులు ఆన్లైన్లో తీసుకోగలరా.. అందుకే మోహన్ బాబు లాంటి వాళ్లు వచ్చి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి అన్నారు.
పవన్ సినిమాలను బ్యాన్ చేయండి..
రాజకీయ నాయకులు లక్ష కోట్లు సంపాదించొచ్చా.. తాము మాత్రం సంపాదించకూడదా. రాజ్యాంగ స్పూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని. సినీ ఇండస్ట్రీకి కులాలు, మతాలు ఉండవన్నారు. దురదృష్టవశాత్తు కులాలకే పరిమితమైతే అసలైన రిపబ్లిక్ స్పూర్తి పోతుందన్నారు. ప్రభుత్వానికి తనపై కోపం ఉంటటే.. తన సినిమాలు ఆపేయండి అన్నారు. తమ వాళ్లను వదిలేయండన్నారు.. ఉపయోగపడని సోదర భావన దేనికి. మీ అందరికీ ఇబ్బంది ఉండొచ్చేమో నేనిలా మాట్లాడటం. వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకుడు,చీఫ్ జస్టిస్ పైనే దాడులు చేశారు. అందుకే ఆ సన్నాసికి చెప్పండి. పవన్ సినిమాలు ఆపి చిత్ర పరిశ్రమను వదిలేయండి అంటూ ప్రభుత్వంపై పరోక్షంగా మంత్రి పేర్నినానిపై పవన్ ఫైర్ అయ్యారు.
అప్పులు తెచ్చుకోవడానికే సినిమా టికెట్లు అమ్ముతున్నారు..
తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి.. ఏపీలో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు.. ఏపీ ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మడం వెనుక అసలు రీజన్ అదే.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. అందుకే సినిమా టికెట్లు అమ్మి.. ఆ ఆదాయన్ని చూపించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకోవాలి అన్నదే ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. డబ్బులు లేకపోయినా ప్రతి దానికి ఆర్థిక శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి ఖజానా దగ్గర నుంచి డబ్బులు తీసుకురండి అంటే వాళ్లు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు.. చివరికి జల్లా సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ లా చిరిగిన చొక్క.. వెనుక బొక్క తప్ప ఏం ఉంది అని అధికారులు చెప్పాల్సి వస్తుంది అన్నారు.
అందరి హీరోలను కలుపుకొని వెళ్లిన పవన్
సినిమా హీరోలు అందరిపై పొగడ్తల వర్షం.. సినిమా వాళ్లు ఎంత కష్టపడి.. ఒళ్లు హూనం చేసుకుంటేనే డబ్బులు వస్తాయని గుర్తు చేశారు. బాహుబలిలో ప్రభాస్, రాణా కండలు కరిగించారని.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు వేసి ఎంటైర్ చేస్తారని.. ఇలా ప్రతి హీరో ఒళ్లుహూనం చేసుకుంటేనే డబ్బులు వస్తున్నాయన్నారు. అలాగే నానిని ఇటీవల కొందరు తిట్టడం చూసి బాధ వస్తోంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా
హాళ్లు తీయకపోతే నాని ఏం చేస్తాడని.. ధైర్యం ఉండే ఏపీ ప్రభుత్వంతో పోరాడాలి అన్నారు.
అన్నయ్యకు స్వీట్ వార్నింగ్..
సినిమా పరిశ్రమలపై లక్షల మంది ఆధారపడి ఉన్నారని.. అంతమంది పొట్టకొడుతున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అసవరం అందరికీ ఉందన్నారు. అయితే మనం ఏ తప్పు చేయనప్పుడు ప్రభుత్వం ముందు చేతులు కట్టుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి గారి కూడా చెప్పండి.. ప్రభుత్వానికి వేడుకోవడం ఏంటి.. గట్టిగా నిలదీయండి అంటూ అన్నయ్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్..