పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) మరోసారి తనలోని దానగుణాన్ని చాటుకున్నారు. భీమ్లానాయక్ (Bhimla Naik) లో పాటపాడిన మొగిలయ్యకు (Mogilaiah) అండగా నిలిచారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. పవన్ జన్మదినం సందర్భంగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
2/ 6
భీమ్లా నాయక్.. అంటూ సాగే ఈ పాటను కిన్నరమెట్ల వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
3/ 6
అరుదైన కిన్నెరమెట్ల వాయిద్యంపై స్వరాలు పలికిస్తున్నా సరైన గుర్తింపులేకపోవడంతో మొగిలయ్య ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు.
4/ 6
మొగిలయ్య గొప్పతనాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్.. భీమ్లానాయక్ లో పాటపాడే అవకాశాన్ని కల్పించారు.
5/ 6
తాగా పవన్ మరో అడుగు ముందుకేశారు. మొగిలయ్యకు రూ.2లక్షల ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
6/ 6
పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ ద్వారా సాయాన్ని అందించాల్సిందిగా పవన్ తన సిబ్బందికి సూచించారు. త్వరలోనే మొగిలయ్యకు చెక్కును అందజేస్తామని ప్రకటించారు.