ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మోదీ సమర్పించిన అఫిడవిట్లో ప్రధాని తన ఆస్తులు, అప్పులను వివరించారు. మోదీ వద్ద స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.2,51,36,119 ఉన్నాయి. అప్పులు లేవు. మోదీ పేరిట వాహనాలు కూడా లేవు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. (PTI)
2/ 9
ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు.
3/ 9
అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం నరేంద్ర మోదీ వద్ద రూ.1,41,36,119 విలువైన చరాస్తులు ఉన్నాయి.
4/ 9
మోదీ పేరు మీద గుజరాత్లోని గాంధీనగర్లో 3531.45 చదరపు అడుగుల స్థలం ఉంది. దాని మార్కెట్ విలువ రూ.1,10,00,000గా పేర్కొన్నారు.
5/ 9
ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి ఆప్పులు లేవు. ఆయన పేరు మీద వాహనాలు కూడా లేవు.
6/ 9
1967లో ఎస్ఎస్సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్టు తెలిపారు.
7/ 9
ఐదేళ్లలో తనకు రూ.72,03,921 ఆదాయం వచ్చినట్టు నరేంద్ర మోదీ అఫిడవిట్లో పేర్కొన్నారు.
8/ 9
మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1,13,800
9/ 9
మోదీ తన భార్య జశోదా బెన్ పేరును అఫిడవిట్లో పొందుపరిచినా, ఆమె పాన్ కార్డు, ఆస్తులు, అప్పులు వివరాలు తెలియవని రాశారు. (PTI)