వైఎస్సార్ కూతురుగా కాదు సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూతద్దం పెట్టి వెతికినా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. వైఎస్సాఆర్ హయాంలో పేద కుటుంబాలు.. రైతు కుటుంబాలు.. సంతోషంగా ఉండేవి. పంటకు గిట్టుబాటు ధర ఉండేది. ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేద విద్యార్థులకు సకాలంలో పూర్తి రీయింబర్స్మెంట్ అందుతుండేది.-వైఎస్ షర్మిల
2014 ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు.-వైఎస్ షర్మిల
అమరావతి నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చూపించారు తప్పితే కానీ ఒక్క శాశ్వత భవనమైన నిర్మించారా? ఎక్కడ చూసినా అవినీతి. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు.-వైఎస్ షర్మిల
జయంతికి, వర్దంతికి తేడా తెలియని లోకేశ్‌కు మూడు మంత్రిత్వ శాఖలు ఎలా అప్పగించారు..? ఈ ఎన్నికల్లో లోకేశ్ కామెడీ షో లేకపోతే రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేదేమో-వైఎస్ షర్మిల
జగనన్నకు తోడుగా ఈ నెల 29 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను. పప్పు ఓడిపోతే అంతకంటే సంతోషం ఏముంటుంది.. అందుకే అక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నా-వైఎస్ షర్మిల
తొమ్మిదేళ్లు జగనన్న విలువలతో కూడిన రాజకీయం చేశాడు, చంద్రబాబులా అధికారం కోసం ఆచర సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వలేదు, పదవుల కంటే విశ్వసనీయత ముఖ్యం అనుకున్నాడు.-వైఎస్ షర్మిల
పవన్ కళ్యాణ్ యాక్టర్, యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. కాబట్టి చంద్రబబు డైరెక్షన్లో.. ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. పవన్ నామినేషన్‌కి టీడీపీ క్యాడర్ కదిలింది. పైకి మాత్రం పొత్తులు లేవంటారు.. లోపలేమో కుమ్మక్కు రాజకీయాలు. పవన్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే.-వైఎస్ షర్మిల
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా కుటుంబ సభ్యుల హత్యలు జరిగాయి. చంద్రబాబుకు దమ్ముంటే వైఎస్ వివేకా హత్యపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి-వైఎస్ షర్మిల
నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చగలమనే నమ్మకంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోంది. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళతామో తెలుసుకోవాలంటే ప్రజలు పార్టీకి అధికారం ఇవ్వాలి-వైఎస్ షర్మిల
పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.14వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు పెంచారు. నామినేషన్ పద్ధతిలో కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అందుకే కేంద్రం నుంచి పోలవరాన్ని లాగేసుకున్నది నిజం కాదా?. పోలవరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మీరు చెప్పలేదా?.. ఇప్పటికీ ఎందుక పూర్తి చేయలేకపోయారు-వైఎస్ షర్మిల