PHOTO GALLERY YS SHARMILA ELECTION CAMPAIGN IN KAKINADA MS
Photos : 'నారా' రూప రాక్షసులను నమ్మవద్దు : కాకినాడ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల
YS Sharmila Election Campaign : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ తరుపున వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్థి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్లీ చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లను నమ్మి వారికి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని మరోసారి లూటీ చేస్తారని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే.. రైతన్న రాజ్యం రావాలంటే.. అందరికీ న్యాయం జరగాలంటే జగనన్న అధికారంలోకి రావాలని అన్నారు.
మీ ఓట్లు కొనడానికి చూస్తారు.. చంద్రబాబు ఎన్ని డబ్బులు పంచినా... మీ బాకీని తీర్చలేరు. అమ్ముడుపోతారా?.. ఈ అవినీతి పాలన పోవాలంటే.. ఈ పది నాలుకల రావణాసురుడు పోవాలంటే జగనన్న రావాలి.-వైఎస్ షర్మిల
2/ 10
వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. మాట మరువనివాడు.. మడమ తిప్పనివాడు కావాలంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్లీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి.-వైఎస్ షర్మిల
3/ 10
జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా.-వైఎస్ షర్మిల
4/ 10
పొరపాటున మన భవిష్యత్తు వీరి చేతిలో పెడితే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. చంద్రబాబుతో పనిచేసిన సీఎస్ అజయ్ కల్లం.. ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతి గత 40ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ డబ్బంతా ఏమైంది. తండ్రీ కొడుకులు కలిసి లూటీ చేశారు. వీళ్లు 'నారా'రూప రాక్షసులు.-వైఎస్ షర్మిల
5/ 10
వైసీపీ కాకినాడ లోక్‌సభ అభ్యర్థి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న వైఎస్ షర్మిల..
6/ 10
జగనన్న అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు మే నెలలోనే రూ.12వేలు ఇస్తాం. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు కూడా ఇవన్నీ వర్తింపజేస్తాం.
7/ 10
డ్వాక్రా మహిళల రుణాలన్నింటిని మాఫీ చేసి.. నాలుగు దఫాల్లో ఆ డబ్బును మళ్లీ మీ చేతుల్లో పెడుతాం-వైఎస్ షర్మిల
8/ 10
విద్యార్థులు ఏ చదువును ఎంచుకున్నా.. ఏ కోర్సు ఎంచుకున్నా.. ఏ కాలేజీ అయినా.. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది.-వైఎస్ షర్మిల
9/ 10
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో యువకులకు ప్రాధాన్యం.. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం కూడా తీసుకొస్తాం.-వైఎస్ షర్మిల
10/ 10
పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. వికలాంగులకు రూ.3వేలు పెన్షన్, ప్రతీ పేదవాడికి పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఐదేళ్లలో క్రమంగా పూర్తి మద్యపాన నిషేధం చేస్తాం-వైఎస్ షర్మిల