ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. హుస్నాబాద్ సభ తర్వాత టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ఇదే. సభలో ప్రసంగించిన గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు తిరిగి ఆంధ్రా చంద్రబాబు నాయుడు ఆధిపత్యాన్ని తెలంగాణపై రుద్దడమే అని ఆయన ఆరోపించారు.