AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్... బారులు తీరిన ఓటర్లు
AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్... బారులు తీరిన ఓటర్లు
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో రెండో విడత పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.
1/ 5
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
2/ 5
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 167 మండలాలకు సంబంధించిన 2,786 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
3/ 5
ఉదయం 6.30 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుంది. 4 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలిగం ముగుస్తుంది.
4/ 5
రెండో విడత పోలింగ్ లో మొత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగా.. వాటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 స్థానాల కోసం 7,507 మంది పోటీపడుతున్నారు.
5/ 5
33,570 వార్డులకు గానూ 12,604 ఏకగ్రీవమవగా.. 149 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 20,817 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 44,876 మంది అభ్యర్థులు వార్డుల బరిలో నిలిచారు.