Home » photogallery » politics » PAWAN KALYAN VISITS VEGETABLE MARKET IN TIRUPATI TO KNOW ABOUT ONION SK

PICS: మార్కెట్‌లో ఉల్లిపాయలు ఏరిన పవన్ కల్యాణ్

తిరుపతిలో రైతు బజార్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఉల్లి కొరత, ధరలపై రైతులను ఆరా తీశారు. గృహిణుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ రైతులతో మాట్లాడున్న క్రమంలో స్థానికులు, మీడియా ప్రతినిధులు కొందరు ఉల్లిపాయలను కాళ్ల కింద తొక్కుతూ పైపైకి వచ్చారు. దీంతో పవన్ అక్కడున్నవారినందరిని మందలించారు. దయ చేసి ఉల్లిని తొక్కొద్దంటూ విజ్ఞప్తి చేశారు. స్వయంగా ఆయనే వంగి నేలపై చెల్లా చెదురుగా పడిపోయిన ఉల్లిపాయల్ని ఏరి పైకి వేశారు.