ఏపీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలను టార్గెట్ చేశారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ఆయన తాజాగా నిరుద్యోగుల సమస్యపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు 2024 ఎన్నికల కోసం కొత్త నియోజకవర్గం వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే పవన్ కల్యాణ్ నియోజకవర్గం వేటలో బిజీ అయ్యారని సమాచారం.
అంతెందుకు తాజాగా జనసేన నేతలు, కార్యకర్తలు అన్నమాటలు వింటే గాజువాకకు పవన్ బైబై చెప్పేశారని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విశాఖలో స్టీల్ ఉద్యమం ఎగసి పడుతోంది. బీజేపీ మినహా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఉక్కు ఉద్యమానికి మద్దతుగానే నిలుస్తున్నాయి. ఇటీవల ఉక్కు ఉద్యమంలో భాగమవుదామని జనసేన నేతలు, కార్యకర్తలు వెళ్లే అక్కడ కార్మికులు అడ్డుకున్నారు.
పవన్ కళ్యాణ్ వచ్చి దీక్షలో కూర్చోవాలని అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు.. దానికి సమాధానంగా గాజువాకలో పవన్ ను మీరు ఓడించారని.. ఆయన ఎందుకు ఇక్కడకు వస్తారని ప్రశ్నించారు. అంటే ఓడిపోయారు కాబట్టి ఇక ఇక్కడి సమస్యలు ఆయనకు పట్టవు అనే రీతిలో జనసేన నేతలు సమాధానం విని కార్మికులు షాకు తిన్నారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి లేదు. త్వరలోనే అధికారికంగా ఆ పని పూర్తి కానుంది. ఇప్పటికే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లాలని ఇప్పటికైతే జనసేన నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం గాజువాకపై ఎక్కువగా ఉంటుంది. అంటే కచ్చితంగా బీజేపీ లేదా జనసేన ఎవరు అక్కడ పోటీలో నిలిచినా వారిని ఓటర్లు తిరస్కరించే అవకాశం ఉంది.
ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లోనే అది రుజువైంది. అధికార వైసీపీ నేతలకు గాజువాక ఓటర్లు ఓట్ల రూపంలో షాక్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నామని చెప్పుకున్న వైసీపీనే అక్కడి ఓటర్లు తిరస్కరించారంటే.. ఇక బీజేపీ మద్దతుతో బరిలో నిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పూర్తిగా గాజువాకకు గుడ్ బై చెప్పేసినట్టే.
మరోవైపు పవన్ తనకు సరైన నియోజకవర్గం వెతికే పనిని అత్యంత నమ్మకస్తులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటికే పవన్ కు తిరుపతి సూచించారని ప్రచారం ఉంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అజన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని డిసైడ్ అయ్యారట..
మరోవైపు పవన్ తనకు సరైన నియోజకవర్గం వెతికే పనిని అత్యంత నమ్మకస్తులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటికే పవన్ కు తిరుపతి సూచించారని ప్రచారం ఉంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అజన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని డిసైడ్ అయ్యారట..
అలాగే వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయకుండా ఒక చోటే ఫిక్స్ అవ్వాలని పవన్ నిర్ణయానికి వచ్చారట. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. ఓటమి భయంతో రెండు చోట్లా పోటీచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కోవాలసి వస్తుందని.. అలాగే బీజేపీ పొత్తులో వారికి కొన్ని సీట్లు.. జనసేన నేతలకు సీట్లు కేటాయించడం కష్టం అవుతుంది. తానే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒకరికి మిగతా అభ్యర్థులకు ఇబ్బంది అనే అంశాన్ని కూడా పవన్ గుర్తించినట్టు సమాచారం.