తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2/ 9
గాజు గ్లాస్ గుర్తుపై తెలంగాణలో పోటీ చేయడం లేదని వెల్లడించారు.Image: Facebook/Janasena party)
3/ 9
ఆసక్తి ఉన్న కార్యకర్తలు ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చని... స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థులకు జనసేన మద్దతిస్తుందని తెలిపారు.
4/ 9
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది.
5/ 9
అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
6/ 9
ఎన్నికల్లో పోటీ చేయకుండా... పోటీ చేసే వారికి మద్దతు ఏంటనే దానిపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు.
7/ 9
ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణలోని జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
8/ 9
అయితే తెలంగాణ జనసేన నేతలతో చర్చించిన తరువాతే పవన్ కళ్యాణ్ ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.
9/ 9
మొత్తానికి తెలంగాణలో పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారా లేక కన్ఫ్యూజ్ చేశారా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు.