Janasena Party: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన రికార్డ్ ఇదే... ప్రకటించిన పవన్ కల్యాణ్
Janasena Party: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన రికార్డ్ ఇదే... ప్రకటించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) జనసేన (Janasena Party) ప్రభావం కనిపించిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపించిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తొలిదశ కంటే.. రెండో దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెగిందన్నారు.
2/ 6
తొలి విడతలో జనసేను 18శాతం ఓట్లు వస్తే.. రెండో విడతలో 22శాతం ఓట్లు వచ్చాయన్నారు.
3/ 6
250కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారని... 1500 పంచాయతీల్లో రెండోస్థానం వచ్చిందన్నారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లు పవన్ వెల్లడించారు.
4/ 6
తాడేపల్లి మండలంలో దళిత మహిళ మేదరి సౌజన్య నరసరావుపేట మండలంలో గౌసిగా బేగం., ఉద్దానంలో జనసేన అభ్యర్థి గెలవడం సంతోషాన్నించిందన్నారు పవన్.
5/ 6
ముఖ్యంగా కృష్ణాజిల్లా కలిదిండి మండలం, కోలుకొల్లు గ్రామంలో 9 నెలల గర్భంతో పోటీ చేసి గెలిచిన లీలా కనకదుర్గను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె జనసైనికులకు స్ఫూర్తినిచ్చారన్నారు.
6/ 6
మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ జనసైనికులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.