PAWAN KALYAN ALLEGES YSRCP FEAR OF KCR IN TELANGANA SATIRES ON TDP SENIOR LEADER AK
టీఆర్ఎస్ అంటే వైసీపీకి భయం.. టీడీపీ సీనియర్ నేతపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
వైసీపీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే భయమని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకు కేసీఆర్ అంటే గౌరవం ఉందని... భయం లేదని విజయనగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు.
మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరంలో మళ్లీ బొత్స సత్యనారాయణ కుటుంబం పాలన వద్దని అన్నారు.
2/ 5
వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమీ చేయరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ పార్టీ నేతల జులం మనకు అవసరమా అని వ్యాఖ్యానించారు.
3/ 5
టీడీపీ నేత అశోక్‌గజపతి రాజుకు తానే ఎవరో తెలియదన్న పవన్ కళ్యాణ్... ఇక ప్రజలు ఏం గుర్తుంటారని ఎద్దేవా చేశారు. ఆయనది మంచి మనసు అంటూ ఎద్దేవా చేశారు.
4/ 5
తెలంగాణలో అభ్యర్థులను నిలిపే ధైర్యం వైసీపీ నేతలు చేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ తాను అలా కాకుండా పలువురు అభ్యర్థులను బరిలో నిలిపానని వ్యాఖ్యానించారు.
5/ 5
జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు.