ఏపీలో ఓట్ల పండగ ఉండటంతో సికింద్రాబాద్లో రద్దీ పెరిగింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా జనం.. సొంత ఊళ్లకు క్యూ కట్టారు. దీంతో రిజర్వేషన్లు చేసుకున్నవారు సైతం రైలు ఎక్కని పరిస్థితి చోటుచేసుకుంది. రన్నింగ్ రైలును కూడా క్యాచ్ చేసి చాలామంది యువకులు రైలు ఎక్కేందుకు సాహసం చేశారు. ఏపీలో ఎన్నికలతో మరోసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సంక్రాంతి రద్దీ కనిపించింది. ఫ్లాట్ ఫామ్స్ అన్ని ప్రయాణికులతో కిక్కరిసిపోయాయి. బోగీలకు వేలాడి మరి సొంతూరు వెళ్లేందుకు యువకులు క్యూకట్టారు. కొంతమంది ప్రయాణికులు మాత్రం రైలు ఎక్కలేక... రైల్వే స్టేషన్లోనే నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. సికింద్రాబాద్లో ప్రయాణికుల రద్దీ ఏపీకి క్యూ కట్టిన ఓటర్లు బోగీలకు వేలాడుతూ వెళ్తున్న యువకులు