రాజకీయాల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నాయకులు ముందుకు సాగుతుంటారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
తాజాగా ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. (ఫైల్ ఫోటో)
3/ 10
బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబుకు వియ్యంకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. టీడీపీలో చంద్రబాబు తరువాతి స్థానంలో ఉన్న లోకేశ్ బాలకృష్ణకు స్వయానా అల్లుడు.(ఫైల్ ఫోటో)
4/ 10
చంద్రబాబు, లోకేశ్ ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.(ఫైల్ ఫోటో)
5/ 10
అయితే బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్... సీఎం జగన్ విశాఖ విషయంలో తీసుకున్న నిర్ణయానికి జై కొట్టారు. (ఫైల్ ఫోటో)
6/ 10
దీనిపై విశాఖ టీడీపీ నేతలు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీభరత్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.(ఫైల్ ఫోటో)
7/ 10
విశాఖ విషయంలో చంద్రబాబు, లోకేశ్ నిర్ణయాన్ని విశాఖలోని మిగతా టీడీపీ నాయకుల తరహాలోనే శ్రీభరత్ కూడా వ్యతిరేకిస్తున్నారా ? అనే టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.(ఫైల్ ఫోటో)
8/ 10
అయితే విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే శ్రీభరత్ ఈ విషయంలో ముందుకు సాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. (ఫైల్ ఫోటో)
9/ 10
మరోవైపు ఇలాంటి సమావేశానికి వెళ్లడానికి ముందు ఆయన కచ్చితంగా లోకేశ్ లేదా బాలకృష్ణను సంప్రదించి ఉంటారనే వార్తలు కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.(ఫైల్ ఫోటో)
10/ 10
మొత్తానికి ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టినట్టే కనిపిస్తోంది.(ఫైల్ ఫోటో)