కరోనా పరిస్థితులు, ఎన్నికల కమిషన్ ఆంక్షల నేపథ్యంలో బహిరంగ సభలకు బదులు వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే బడా నేతలు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం యూపీలో తన తొలి వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. తొలి సభలోనే విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో యూపీకి యోగి సర్కార్, కేంద్రం ఏమేం చేసిందో మోదీ వివరించారు. (Image credit twitter)
యూపీలో అన్ని వర్గాలనూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని, పేదలకు గృహాలు, వెనుకబడిన కులాలకు చేయూత, భారీ ఎత్తున మెడికల్ కాలేజీల స్థాపన, అధునాతన ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ పెంపు, ముస్లిం మహిళల గౌరవాన్ని నిలబెట్టే నిర్ణయాలు.. ఇలా అనేకానేక పథకాలను యోగి సర్కారు విజయవంతంగా కొనసాగిస్తున్నదని మోదీ గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష పార్టీలు ప్రతీకార రాజకీయాలను ప్రేరేపిస్తున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తోన్న బీజేపీపై ప్రతీకారం తీర్చుకోమంటూ ప్రతిపక్షాలు ఓటర్లను కోరడాన్ని ప్రధాని మోదీ ఆక్షేపించారు. పేదల కోసం పాటుపడుతోన్న యోగి సర్కారుకు వ్యతిరేకంగా నకిలీ సమాజ్ వాదీలు ప్రచారం చేపట్టారని మండిపడ్డారు. (Image credit twitter up bjp)
యూపీ ఎన్నికల్లో కీలక అంశంగా నిలిచిన నోయిడా భూకుంభకోణం అంశంపైనా ప్రధాని మోదీ కీలక హామీ ఇచ్చారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వేలాది మంది బాధితులు మోసపోయారని గుర్తుచేసిన ప్రధాని.. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. మొత్తం 403 స్థానాలున్న అసెంబ్లీకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. (Image credit twitter up bjp)