ఎమ్మెల్యే రోజా తగ్గేదే లేదంటున్నారు. ఇటీవల శస్త్ర్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె పూర్తిగా రెస్ట్ కే పరిమితం అవ్వకుండా నియోకవర్గ సమస్యలపై ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ ద్వారా స్థానిక నేతలు, సర్పంచ్ లకు టచ్ లో ఉంటున్నారు. అంతేకాదు.. ఆన్ లైన్ లోనే పలు సూచనలు చేస్తున్నారు..
ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కొవిడ్ పై అధికారులను పార్టీ నేతలను రోజా అప్రమత్తం చేస్తున్నారు. ఇంటివద్దే ఉంటూ ఏపీఐఐసీపై సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర, వడమాలపేట మండలాల సర్పంచులు, నాయకులతో కరోనా నియంత్రణ, వైద్య పరమైన చర్యలు, తదితర అంశలపై జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రోజా పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి రావాలని ఉన్నా.. సర్జరీ కారణంగా రాలేకపోతున్నాని ఆమె అన్నారు.
అంతేకాదు కొందరికి వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మున్సీపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కుంగిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురవడంతో విషయం తెలుసుకున్న రోజా.. స్వయంగా కలెక్టర్ కు ఫోన్ చేశారు. స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణమే తప్పన్న ఆమె.. కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే వదలిపెట్టొద్దని.. అవసరమైతే నాలుగు తగిలించైనా బిల్లులు రాబట్టాలన్నారు.
ఏపీ అసెంబ్లీ నేటి బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఎందరో ప్రధానాలు, మహిళా ముఖ్యమంత్రులు కూడా చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు అన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా సీఎం జగన్ మహిళకు ఇస్తున్న ప్రాధాన్యం చూసి గర్వంగా ఉంది అన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి అవ్వ వరకు ప్రతి ఒక్క మహిళకు లబ్ధి చేకూరే విధంగా జగనన్న పథకాలు ప్రవేశ పెట్టారని కొనియాడారు.