నగరి ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో ఉన్నారు. త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో ఆమె మరింత ఉత్సాహంగా ఉన్నారు అంటున్నాయి వైసీపీ శ్రేణులు.. రోజా తాజాగా డప్పు కొట్టి సందడి చేశారు.. ఎందుకో తెలుసా..?
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా సందడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏపని చేసిన హంగామా ఉంటుంది. గతంలో అంబులెన్స్ నడిపారు.. స్కూటర్ పై సవారీ చేశారు.. తాజాగా డప్పు కొట్టి దరువేశారు..
2/ 9
ఇటీవల నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
3/ 9
నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందని వారికి హామీ ఇచ్చారు..
4/ 9
సుమారు ఏడు వందల మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పులు, డ్రెస్సులు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర వారికి సంబంధించి వస్తులను ఎమ్మెల్యే రోజా స్వయంగా అందచేశారు.
5/ 9
డప్పులు అందజేసిన ఆమె.. కాసేపు కళాకారులతో కలిసి హంగామా చేశారు. స్వయంగా డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు ఎమ్మెల్యే రోజా. ఆడుతూ పాడుతూ వారందర్నీత్సాహ పరిచారు.
6/ 9
మరోవైపు పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయకులు, ప్రజలు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు.
7/ 9
ఇటీవల ఎమ్మెల్యే రోజా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అటు సీరియస్ షోలతో బిజీగా ఉన్నఆమె.. విరామం లేకుండా సేవా కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొటున్నారు..
8/ 9
కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసరాలు అందించడం, ఆక్సిజన్ అందేలా చూడడం.. ఇలా పలు సేవాకార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు..
9/ 9
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టడమే ఆమె లక్ష్యమని.. అందుకే ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఆమె కనిపిస్తున్నారని స్థానిక నేతలు అంటున్నారు..