GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18 MLA Roja: వైసీసీ ఎమ్మెల్యే రోజాకు (YCP MLA Roja) ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. అంతే కాదు ఆమె మల్టీ టాలెంట్ కూడా.. ఇప్పటికే ఎన్నో బాధ్యతల్లో ఇమిడిపోయారు. రాజకీయ నేతగా, హీరోయిన్ గా.. సాధారణ గ్రృహిణిగా, టీవీ యాంకర్ గా.. జబర్దస్త్ (Jabardasth)లాంటి ఈవెంట్లకు జడ్జ్ గా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే అవుతుంది. తాజాగా ఆమె టీచర్ (Teacher)అవతారం ఎత్తారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా (Chitoor District) నగరి ఎమ్మెల్యే రోజా (Nagari MLA Roja) కొత్త అవవాతరం చూసి అంతా షాక్ కు గురయ్యారు. ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా అనుకుంటున్నారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా పుస్తకం పట్టారు. క్లాస్ రూమ్ (Class Room)లోకి వెళ్లి బ్లాక్ బోర్డుపై రాస్తూ.. విద్యార్థులకు బోధన చేశారు.
కరోనా సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఎంతో మందిని పొగొట్టుకోవడం చూశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా కాన్వెంట్ స్కూల్లో చదువుకునేలా బట్టలు, పుస్తకాలు, భోజనం ఇవ్వడం మాత్రమే కాకుండా పాఠశాలల్లో డిజిటిల్ లైబర్రీలను ఏర్పాటు చేసి విద్యార్థుల భాషాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.