రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 578 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 570 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ 6, బీజేపీ 1, ఇతరులు ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లలో 89 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇందులో చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలోనే అధిక స్థానాలున్నాయి.