ఏపీ సీఎం జగన్ (CM YS Jagan) - వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)ది విడదీయ లేని బంధం.. రాజకీయ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా ఇద్దరూ సన్నిహితంగా ఉంటారన్నది అందిరకీ తెలిసిందే.. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని.. సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డిని పక్కన పెడుతున్నారంటూ కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటాను అంటూ విజయసాయి రెడ్డి దిగిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పాలన, రాజకీయ వ్యవహారాలను అన్ని పక్కన పెట్టి సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లా (simla)వెళ్లారు.. రేపు పెళ్లి రోజు వేడుకలను ఆయన ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే సిమ్లాలో సీఎం జగన్ తన ఫ్యామిలితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా విజయసాయి రెడ్డి తాను సిమ్లాలోనే ఉన్నానంటూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.
అది కూడా విజయసాయి రెడ్డి కి కోర్టు బిగ్ రిలీజ్ ఇచ్చిన రోజే ఈ ఫోటోలు బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా విజయ సాయి రెడ్డి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయి రెడ్డి సీబీఐ కోర్టును కోరారు.