నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఎన్నికల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. పసుపు రైతులు ఆందోళనలతో అట్టుడుకుతున్న నిజామాబాద్‌లో ఎంపీ కవితతో పాటు... 185మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది.