MP KAVITA HELPED A ROAD ACCIDENT VICTIM IN NIZAMABAD MS
Photos : మానవత్వం చాటుకున్న ఎంపీ కవిత..
పార్టీ కార్యక్రమం నిమిత్తం నిజామాబాద్ నుంచి కేశ్‌పల్లికి బయలుదేరిన ఎంపీ కవిత.. మార్గమధ్యలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. అంబులెన్స్‌కు ఫోన్ చేయించి క్షతగాత్రున్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం డాక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎంపీ కవిత.
2/ 7
సోమవారం సాయంత్రం డిచ్పల్లి మండలం కేశ్పల్లిలో గడ్డం ఆనంద్ రెడ్డి టిఆర్ఎస్లో చేరే కార్యక్రమానికి నిజామాబాద్ నుండి బయలుదేరిన సందర్భంలో.. మార్గమధ్యలో ధర్మారం గ్రామం మూల మలుపు వద్ద కాకతీయ స్కూల్ బస్సు ఢీకొని కిందపడిపోయిన జిలానిని చూసి వెంటనే స్పందించారు..
3/ 7
వెంటనే కారు దిగి అంబులెన్స్‌కు, డాక్టర్లకు ఫోన్లు చేయించారు.. సమీపంలోనే ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో వారిని ఓదార్చారు..
4/ 7
అంబులెన్స్ వస్తోందని జిలాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు..
5/ 7
ప్రమాద స్థలికి కేవలం 100 మీటర్ల దూరంలో నే జిలానీ ఇల్లు ఉంది. భీంగల్‌కు చెందిన జిలానీ వంట పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.
6/ 7
అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులను కూడా జిలానీతో పాటు ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎంపీ కవిత డాక్టర్లకు ఫోన్ చేసి కోరారు..
7/ 7
ఎంపీ కవిత వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, ఆకుల లలిత, ఇతర నాయకులు ఉన్నారు.