త్వరలో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నరోజాకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమె.. ఇటీవల చాలా దూకుడు పెంచారు. ఆ మధ్య రాష్ట్రంలో కరోనా పరిస్థితి. శస్త్రచికిత్స కారణంగా కొంతకాలం విరామం తీసుకున్న ఆమె మళ్లీ.. తనదైన స్టైల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జల జగడంలో మంత్రులకంటే.. టీఆర్ఎస్ నేతలకు ఆమె ముందుగా పంచ్ లు వేశారు. నియోజకవర్గ పనుల్లోనూ జోష్ పెంచారు. ఆమె దూకుడు చూసినవారంతా త్వరలోనే మంత్రి పదవి ఖాయం అంటూ చర్చించుకుంటున్నారు. అధిష్టానం నుంచి కూడా సంకేతాలు అందాయని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు.
తొలి కేబినెట్ లోనే తనకు అవకాశం ఇస్తారని భావించారు. అప్పటి సామాజిక సమీకరణాలు.. జిల్లాలో రాజకీయ పరిస్థితులతో పదవి దక్కలేదు. ఆమెను బుజ్జగించేందుకు ఏఐసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. తాజాగా ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. అలాగే ఎమ్మెల్యే జక్కం పూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆయన్ను తప్పించారు.. అలాగే మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి కూడా షాక్ ఇచ్చారు.
ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం.. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణచయమే అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర స్థాయిలో జోడు పదవుల విధానానికి ముగింపు పలకాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేశారు సీఎం జగన్. దీంతో రెండు పదవులను అనుభవిస్తున్న అందరి ఎమ్మెల్యేలకు షాక్ తప్పలేదు.
అయితే సీఎం జగన్ నిర్ణయంపై ఆ ఎమ్మెల్యేలు మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగా అలా జోడు పదవులు వద్దనుకుంటే ముందే చెబితే మర్యాదగా అందరూ తప్పుకుంటారు కదా.. ఇలా తెలియకుండా ఎలాంటి సమాచారం లేకుండా తప్పిస్తే జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని సన్నిహతుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
మరోవైపు మంత్రి ఈ పదవులు పోయినా మంత్రి పదవి వస్తుందనే నమ్మకం కూడా సన్నిగిల్లుతోంది. సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఆ జాబితాలో రోజా కూడా ఉన్నారు. ఇంతకాలం తనకు మంత్రి పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు.. కానీ ప్రస్తుతం జగన్ తీరు చూస్తుంటే మంత్రి పదవి డౌటే అనే అనుమానం మొదలైందని సమాచారం..