Player Roja Playing Vollyboall: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పంచ్ డైలాగ్ లు పేల్చాలి అన్నా.. ప్రత్యర్థి నేతలపై కౌంటర్లు వేయాలి అన్నా.. ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విపక్షాలకు కౌంటర్ ఇవ్వాలి అంటే వైసీపీ నేతలు ముందుగా రోజా కోసమే ఎదురు చూస్తారు. అది ఆమె బ్రాండ్.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా ఆమెకు తిరుగులేని ముద్రే ఉంది. ఇలా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలను చడుగుడు ఆడడమే కాదు.. కోర్టులో దిగి ఆటల్లో అదరగొట్టే టాలెంట్ తనకు ఉంది అంటున్నారు రోజా..
ఇక సినిమాల్లోనూ, రియాల్టీ షోల్లోనూ.. జబర్ధస్థ్ లాంటి కామెడీ షోల్లోనూ ఆమె తన దైన స్టైల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా మరో టాలెంట్ తనలో ఉందని ఆమె నిరూపించుకుంటున్నారు. ఇటీవల అన్ని ఆటల్లోనూ తన టాలెంట్ చూపిస్తున్నారు. మొన్న కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడిన ఆమె.. తాజాగా త్రో బాల్ ఆటలోనూ అదరగొట్టారు.
రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని రోజానే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆటల పోటీలు ప్రారంభిస్తూ ఆమె కూడా కాసేపు సరదగా ఆటలు ఆడుతున్నారు. తాజాగా అండర్ 17, అబోవ్ 17 విభాగంలో త్రోబాల్ పోటీలను రోజా ప్రారంభించారు...
ఇటీవల కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు. కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్ కు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీగా ఆడారు. మరో రోజు బ్యాడ్మింటన్ లో టాలెంట్ చూపించారు. ఆ తరువాత వాలీబాల్ లో కూడా అదరగొట్టారు. ఇలా తనకు అన్ని ఆటల్లోనూ ప్రవేశం ఉందని.. తాను ఓ ఆల్ రౌండర్ అని చెప్పకనే చెబుతున్నారు రోజా..