Player Roja: రాజకీయాల్లో పంచ్ లు వేయాలి అంటే ఆమె తరువాతే ఎవరైనా.. అందుకే వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లోనూ, రియాల్టీ షోల్లోనూ.. జబర్ధస్థ్ లాంటి కామెడీ షోల్లోనూ ఆమె తన దైన స్టైల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా మరో టాలెంట్ తనలో ఉందని ఆమె నిరూపించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ఆడిన ఆమె.. అంతకముందు కబడ్డీ, వాలీబాల్ గేమ్స్ ఆడి అదుర్స్ అనిపించారు.
నగిరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తాజాగా తన సోదరులు కుమార్ స్వామి రెడ్డితో సోమవారం పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్ లో సరదాగా పోటీ పడడం ఆహుతులను అలరించింది. పుత్తూరు మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ క్రీడ సంబరాలలో భాగంగా షటిల్ బాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా గ్రామీణ క్రీడా సంబరాలు ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తన సోదరుడు కుమారస్వామి రెడ్డి గారితో సరదాగా షటిల్ బాడ్మింటన్ ఆడారు. అయితే ఆమెతో పాటు భర్త సెల్వమణి కూడా.. ఆటలు ఆడుతున్నారు. ఆమె వరుసగా ఇంత ఉత్సాహంగా కనిపించడానికి.. మంత్రి పదవి వస్తుందనే ప్రచారమే కారణమని ఆమె అభిమానులు అంటున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఇటీవల కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టారు. కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్ కు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీగా ఆడారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కూడా బరిలో దిగి కూత పెట్టారు.
ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోజా ఓ జట్టు తరపున.. సెల్వమణి మరో జట్టు తరపున కబడ్డీ ఆడారు. గతంలోనూ ఓసారి రోజా కబడ్డీ ఆడారు. తన నియోజకవర్గంలో టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లి కూతపెట్టారు. అప్పుడు కూడా రోజా కబడ్డీ కోర్టులో సందడి చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.