ఎమ్మెల్యే రోజా.. మంత్రి రోజా అవుతారా..? ఆమె మాత్రం కేబినెట్ బెర్త్ పై భారీగా హోప్ప్ పెట్టుకున్నారు. ఇప్పటికే అధినేత నుంచి హమీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంతో ఆమెకు మంత్రి పదవిక పక్కా అనే ప్రచారం జోరందుకుంది. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి.
ఏపీ కేబినెట్ విస్తరణ వార్తాలు చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో ఇటు పదవులు ఆశించే ఎమ్మెల్యేలు సీఏం దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతుంటే అటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు మాత్రం తమ మంత్రి పదవి ఉంటుందా? ఊడిపోతుందా అనే టెన్షన్ లో ఉన్నారు. ఇప్పటికే ఆగష్టు మొదటి వారంలో ఏపీ కాబినేట్ విస్తరణ ఉండబోతుందన్న వార్తలు వస్తోన్న నేపధ్యంలో పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే తాడేపల్లి చుట్టు చక్కర్లు కొడుతున్నారు. (ఫైల్)
తమ నియోకవర్గల్లో తాము చేసిన అభివృద్దితో పాటు తమని తీసుకుంటే కలిసోచ్చే అంశాలు అన్ని ముఖ్యమంత్రి సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్న చిత్తూరు జిల్లాలకు ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం ఈ మంత్రి పదవి రేసులో చాలా ఆసక్తిని కలిగిస్తోంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డిని తప్పించే అవకాశాలు చాలా తక్కువ.. దానికి తోడు ఆయన ఆశీస్సులు ఉన్నవారికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రోజాకు కేబినేట్ లో చోటు ఇవ్వలేకపోయారు. సామాజీక సమీకరణల్లో భాగంగా రోజాను పక్కన పెట్టాల్సి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం చేసుకున్న రోజా కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఒకనోక సందర్భంలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి స్వయం పిలిచి ఎటువంటి పరిస్థితిల్లో పక్కనపెట్టాల్సి వచ్చింది అనే అంశాలతోపాటు రెండేళ్ల తరువాత కేబినేట్ లో తప్పకుండ స్థానం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అంతవరకు ఏపీఐఐసీ చైర్మన్ గా రోజాను ఉండమని జగన్ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతాయి.
ఇక్కడ వరకు బాగానే ఉన్న రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవి రెడ్డిలు కూడా మంత్రి పదవులు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోన్నారు. ఇప్పటికే ఆనందయ్య అంశం చెవిరెడ్డికి కలిసోస్తుందని చెవిరెడ్డి భావిస్తుంటే గతంలో టీటీడీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి డ్రగ్ ప్రీ ఉద్యమం తనకు కలిసోస్తుందని అనుకుంటున్నారు.