Ganesh Chaturthi 2021: ఎమ్మెల్యే రోజా ఇంట సందడి.. ఇటు కూతురు పుట్టిన రోజు.. అటు వినాయక చవితి వేడుకలు
Ganesh Chaturthi 2021: ఎమ్మెల్యే రోజా ఇంట సందడి.. ఇటు కూతురు పుట్టిన రోజు.. అటు వినాయక చవితి వేడుకలు
MLA Roja: ఎమ్మెల్యే రోజా ఇంట సందడి నెలకొంది. అత్యంత ఇష్టమైన వినాయకచవితికి తోడు ప్రాణంగా చూసుకునే కూతురు పుట్టిన రోజూ ఒకే రోజు రావడంతో.. ఆ ఇంట్లో ఆనందం ఉప్పొంగుతోంది.
Vinayaka Chavithi: ఎమ్మెల్యే ఆర్కే రోజ ఇంట్లో సందడే సందడిగా మారింది. ఈ ఏడాది అంతా శుభమే జరగాలని కోరుతూ కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఘనంగా వినాయక చవితి పూజను నిర్వహించారు రోజా..
2/ 10
ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటారు రోజా కుటుంబ సభ్యులు.. వినాయక చవితికితోడు మరో ప్రత్యేకమైన పండగ వారికి ఈ రోజు
3/ 10
రోజా గారాల పట్టి అన్షు మాలిక పుట్టిన రోజు కూడా ఇవాళే.. దీంతో ఈ రోజు మరింత స్పెషల్ గా మారింది. తమ ఇంటికి సంబంధించి రెండు పండగలు ఒకే రోజు రావడంతో సందడి మరింత పెరిగింది.
4/ 10
రోజా కూతురు అన్షు మాలిక కూడా సోషల్ మీడియాలో సుపరిచితం. అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. కాగా అన్షు మాలిక పుట్టినరోజు సందర్భంగా రోజా తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆ ఫిక్స్ వైరల్గా మారాయి. Photo : Facebook
5/ 10
ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో ఉన్నారు. గతంలో కంటే నియాజకవర్గంలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం త్వరలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం ఉంది.
6/ 10
రాజకీయంగా.. సామాజిక పరంగా చిత్తూరు జిల్లాలో రోజాకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే రోజుకు చాలా విషయాల్లో అడ్డు పడుతూ వస్తున్నారు. గతంలో మంత్రి పదవి రాకపోవడానికి కూడా వారే కారణమని ప్రచారం ఉంది.. మరోసారి వారే ఆమెకు అడ్డంకిగా నిలుస్తున్నారు.
7/ 10
అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా రోజా పని తనమే ఆమెకు మంత్రి పదవి దక్కేలా చేస్తుందని.. ఆమె అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
8/ 10
తాజాగా సీఎం జగన్ సైతం.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నట్టు సమాచారం. ఆ నివేదికలోనూ రోజాకు మంచి మార్కులే పడ్డట్టు తెలుస్తోంది.
9/ 10
Happy Birthday Anshu Malika : ప్రస్తుతం రోజా విషయంలో అంతా హ్యాపీగానే ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఆమె మంచి పోజిషన్ లో ఉండడంతో అంతా కలిసి వస్తోంది. ఇదే సమయంలో కూతురు పుట్టిన రోజు రావడంతో మరింత గ్రాండ్ గా పుట్టిన రోజును జరుపుకున్నారు కుటుంబ సభ్యులు. Photo : Facebook
10/ 10
పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య రోజా వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు.