Perni Nani on CM Jagan - Chirnjeevi Meet: ఆంధ్రప్రదేశ్ మోహన్ రెడ్డి -మెగాస్టార్ చిరంజీవీల భేటీ ఇటీవల ఇటు ఏపీలో, అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇద్దరూ చర్చించుకున్నారని.. లేదు రాజకీయాలు చర్చించారని.. -చంద్రబాబుల పొత్తుకు పై ఎత్తుగా చిరంజీవితో భేటీ అయ్యారని.. చిరంజీవికి రాజ్య సభ పదవి ఇస్తారని.. ఇలా పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమావేశంపై తాజాగా మంత్రి క్లారిటీ ఇచ్చారు.
అదే సమయంలో టాలీవుడ్ తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. చిరంజీవి తనతో బాగా ఉంటారని అనడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. అప్పటి వరకు ఎన్నిసార్లు అపాయింట్ అడిగినా కుదరదని చెబుతూ వచ్చిన ఏపీ సీఎం జగన్.. చిరంజీవిని స్వయంగా ఆహ్వానించారు. లంచ్ మీట్ పేరుతో సినిమా సమస్యలపై చిరంజీవితో జగన్ చర్చలు జరిపారని ప్రచారం జరిగింది.
ఆ భేటీ తరువాత మాట్లాడిన చిరంజీవి సీఎం జగన్ తో సమావేసం చాలా సంతృప్తిగా సాగిందన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరు తెలిపారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని.. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్ కు వివరించినట్లు వెల్లడించారు.
అంతకుముందే పవన్ కళ్యాణ్ తో పొత్తుపెట్టుకుంటునేందుకు సిద్ధం అన్నట్టు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. నిజంగా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా కొంత ప్రభావం ఉంటుంది అన్నదని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో చిరంజీవిని దగ్గరకు చేసుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించరనే ప్రచారం కూడా ఉది. అందులో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్లు పుకార్లు షికారు చేశాయి.
సీఎం జగన్ -చిరంజీవిల భేటీపై ఊహాగానాలే తప్పా.. ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.. అయితే మంత్రి పేర్నినాని ఆ భేటీపై తాజాగా స్పందించారు.. సీఎం జగన్ -చిరంజీవిల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఒకవేళ చర్చలు అయితే సీఎం ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. కేవలం చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించారని.. ఇద్దరు కుశలు ప్రశ్నలు మాత్రమే వేసుకున్నారని.. ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.