దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ భూమి మీద ప్రాణం ఉన్నంతవరకు తాము ఇక్కడే ఉంటామని.. ఓట్లు వేసిన మరుసటి రోజే కాంగ్రెస్ వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు.
2/ 9
దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న హరీశ్ రావు.. రెండో స్థానంలో ఎవరుంటారో చూడాలని అన్నారు.
3/ 9
కాంగ్రెస్ నాయకులు ఖద్దరు అంగీలు వేసుకొని దుబ్బాకకు బయలుదేరారని.. గతంలో ఎప్పుడు రానివారు ఇప్పుడు వస్తున్నారని అన్నారు.
4/ 9
రైతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే కనీసం అండగా లేని కాంగ్రెస్కు ఎలా ఓటేయమంటారని హరీశ్ రావు ప్రశ్నించారు.
5/ 9
టిఆర్ఎస్ అభ్యర్థికి అండగా ఉండి అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని.. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పస్తామని తెలిపారు.
6/ 9
దుబ్బాక పెద్ద చెరువు కట్ట చూడుమని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.
7/ 9
కష్టకాలంలో పేదలకు సీఎం కేసీఆర్ కడుపు నిండా అన్నం పెట్టారని హరీశ్ రావు అన్నారు.
8/ 9
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కూడా లేదని హరీశ్ రావు అన్నారు.
9/ 9
రామలింగారెడ్డి వారసులుగా ఆయన భార్య సుజాతను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు.