హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బిజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ప్రధాని మోదీ చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్ , గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్ ప్రచార శైలి మార్చారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఫోటో, బిజేపీ జెండాలను దాచి కేవలం తన ఫోటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు.