Home » photogallery » politics »

MINISTER ERRABELLI DAYAKAR RAO PARTICIPATES IN DRIVER AND SOCIAL MEDIA INCHARGE FUNERALS MS

Photos : డ్రైవర్ పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మండమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ పార్థసారథి(30), మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన వీరి అంత్యక్రియల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం అంతిమయాత్రలో వారి పాడెను మోశారు. అప్పటిదాకా తనతోనే ఉన్న ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.