గుడిసెలో నివాసం..సైకిల్‌పైనే ప్రయాణం..'ఒడిశా మోదీ'ని చూడండి...

రాజకీయ నేతలంటే హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే...ఆ లైఫే వేరు..! రాజభవనం లాంటి బంగ్లా, ఖరీదైన కార్లు, చుట్టూ అనుచరులు..ఇది నేతల జీవితం. కానీ ఆయన మాత్రం పూరి గుడిసెలో నివసిస్తారు. సైకిల్‌పైనే ప్రయాణం చేస్తారు. తనకు వచ్చిన జీతాన్నంతా పేదల కోసమే ఖర్చుపెడతారు. ఆయనే బీజేపీ నేత, బాలసోర్ (ఒడిశా) ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి.