Home » photogallery » politics »

MAMATA BANERJEES TRINAMOOL CAMPAIGNS IN CHINESE IN KOLKATA SK

చైనీస్ భాషలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం..మమతా మజాకా..

ఇదేంటీ..ఇండియాలో చైనీస్ భాషలో ప్రచారమేంటని అనుకుంటున్నారా..? కోల్‌కతాలోని చైనా టౌన్ ప్రాంతంలో నివసిస్తున్న చైనీస్ హక్కా కమ్యూనిటీ లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీకి మద్దతిస్తోంది. దశాబ్ధాల కాలం కిందే చైనా నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మమత అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రశాంతంగా జీవిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. మాండరిన్ భాషలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తొలి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కావడం విశేషం.