దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. దీంతో వాహనాలు బయటకు తీసేందుకు సామాన్యలు ఆలోచిస్తున్నారు. అసలే కరోనా సమయం. ఉద్యోగాలు లేక రోజురోజుకు జీవనం కష్టమవుతున్న తరుణంలో పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై మరింత భారం పడింది. (Image credit : Ani)
అయితే, మహారాష్ట్రలో ఓ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ ను రూపాయికే అందించారు. మహారాష్ట్ర యువనేత, మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా డోంబివలీ యువసేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్‌ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకూ రెండు గంటల పాటు రూపాయికి లీటర్ పెట్రోల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. (Image credit : Ani)
వందలాది మంది వాహన దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరో వైపు మహారాష్ట్ర అంబర్నాథ్ లో శివసేన నేత అరవింద్ వాలేకర్ రూ.50లకే లీటర్ పెట్రోల్ ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. విమ్కో నాకా పెట్రోల్ బంక్ లో ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ పెట్రోల్ పంపిణీ చేశారు. (Image credit : Ani)
జనసమూహం పెరగడంతో మరో రెండు గంటలపాటు సమయాన్ని పెంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంపిణీ చేశారు. దాంతో సుమారు 1200 మంది ప్రజలు ఈ రూపాయి పెట్రోల్ ప్రయోజనాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర 102 రూపాయలకు చేరుకుంది. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి, పేద ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనే దానికి ఈరోజు వచ్చిన వాహనదారులే రుజువు అని బంకు యజమాని తెలిపాడు. (ప్రతీకాత్మక చిత్రం)