ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగిన ఏడు దశల ఎన్నికల్లో బీజేపీనే మరోసారి అత్యధిక సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్లో వచ్చింది.
తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా మెరుగైందని ఆ ఎగ్జిట్ పోల్లో వచ్చింది.
కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీకి బీహార్లో 15, మహారాష్ట్ర (22- 24), తమిళనాడు (34), కేరళ (15), గుజరాత్ (7), కర్ణాటక (11- 13), పశ్చిమ బెంగాల్ 2, మధ్యప్రదేశ్ (8-10) హర్యానా (5 - 6), రాజస్తాన్ (6-7) సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్లో 5, ఢిల్లీలో 2, ఛత్తీస్గఢ్లో 9,ఒడిశా 2, తెలంగాణ 2, జమ్మూకాశ్మీర్ 2, హిమాచల్ ప్రదేశ్ 1, గోవా 1, జార్ఖండ్ 5, ఉత్తరాఖండ్ 2, ఈశాన్య రాష్ట్రాలు (7- 10).
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చేసే అవకాశం లేదని హస్తం ఎగ్జిట్ పోల్లో తేలింది.