జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా గెలవరని, ఒక్కచోట మాత్రమే గెలుస్తారని ఆయన సర్వేలో వచ్చినట్టు తెలిసింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రెండు చోట్లా పోటీ చేశారు. లగడపాటి లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయే అవకాశం ఉంది. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలో తేలింది. గాజువాకలో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని సర్వేను బట్టి తెలుస్తోంది. జనసేన పార్టీకి కేవలం ఒకటి నుంచి మూడు సీట్లు రావొచ్చని లగడపాటి చేయించిన సర్వేలో తెలిసింది.