మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి సంబంధించిన బాధ్యతలను భుజాన వేసుకున్న తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...ఈ విషయంలో పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
3/ 10
నేడు జరగనున్న కార్యవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు.
4/ 10
ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ముందుగా అభ్యర్థుల ఎంపికపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని భావిస్తున్న పార్టీ నాయకత్వం... టికెట్ల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
5/ 10
ప్రతి మున్సిపాలిటిలో టికెట్ల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
6/ 10
ఈ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంటారని సమాచారం.
7/ 10
ప్రతి వార్డులో టికెట్ కోసం పోటీ పడే అభ్యర్థులను గుర్తించి... వారిలో ఒకరిని ఎంపిక చేయడం ఈ కమిటీ విధి.
8/ 10
కేవలం అభ్యర్థులను ఎంపిక చేయడం మాత్రమే కాదు... మిగతా వారికి నచ్చజెప్పి గెలుపు బాధ్యతలను వారికే అప్పగించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
9/ 10
ఈ మొత్తం ప్రక్రియను ఈ కమిటీలు సమర్థవంతంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆశిస్తోంది.
10/ 10
మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా భావించే అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ ఏర్పాటు చేసే ఈ కమిటీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.