సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలసి ఆయన కొంగరకలాన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఎంత పెండింగ్‌లో ఉందన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. మార్పులు, చేర్పులు సూచించారు.