మమ్మల్ని గెలిపిస్తే లీటర్ రూ.60కే పెట్రోల్.. ఆ రాష్ట్రంలో బీజేపీ హామీ
మమ్మల్ని గెలిపిస్తే లీటర్ రూ.60కే పెట్రోల్.. ఆ రాష్ట్రంలో బీజేపీ హామీ
ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, పార్టీలు అధికారంలోకి రావడానికి నేతలు రకరకాలైన హామీలు గుప్పిస్తుంటారు. తాజాగా, ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే అందిస్తామని బీజేపీ నేత హామీ ఇచ్చారు.

2/ 6
కేరళకు చెందిన బీజేపీ నేత కుమ్మనం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి అధికారం ఇస్తే తాము రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ రూ.60కే అందిస్తామని ప్రకటించారు.
3/ 6
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కుమ్మనం రాజశేఖరన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి లెఫ్ట్ సర్కార్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
4/ 6
దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.100కి చేరింది. డీజిల్ కూడా రూ.100 వైపు పరిగెడుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత ఇచ్చిన హామీ విమర్శలకు తావిచ్చింది.
5/ 6
బీజేపీ అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో ఎందుకు పెట్రోల్ లీటర్ రూ.60కి అందివ్వడం లేదని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
6/ 6
మరోవైపు కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.