కేసీఆర్ బృందం ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో దిగి, నేరుగా మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్, రాజకీయ సమాలోచనలు, ఉమ్మడి ప్రెస్ మీట్ తర్వాత కేసీఆర్ టీమ్ ఎన్సీపీ నేత పవార్ నివాసానికి చేరుకుంది. ఆసక్తికరంగా ఇక్కడ కూడా నటుడు ప్రకాశ్ రాజ్ కేసీఆర్ వెంట వచ్చారు.
శరద్ పవార్‌తో దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా కేసీఆర్ చర్చించారు. అయితే, కేసీఆర్ తొలి నుంచీ వాదిస్తోన్న కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి ఎన్సీపీ మద్దతు ఇవ్వలేని క్రమంలో కాంగ్రెస్ సహిత కూటమి దిశగా పవార్, కేసీఆర్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అదీగాక..
తెలంగాణలో అధికార కు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ఆ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేసీఆర్ బేషరతుగా మద్దతు పలికారు. సర్జికల్ స్ట్రైక్స్ పై రాహుల్ గాంధీ ప్రశ్నలు సమంజసమేనని, కేంద్రం వెంటనే ఆధారాలు బయటపెట్టాలనీ కేసీఆర్ డిమాండ్ చేశారు.