Home » photogallery » politics » JANASENA CHIEF PAWAN KALYAN VISITS MATRI SADAN ASHRAM IN HARIDWAR SK

PICS: హరిద్వార్‌ మాత్రి సదన్ ఆశ్రమంలో పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్గాంచిన రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఆ మేరకు గురువారం హరిద్వార్ వెళ్లారు పవన్. వెన్నునొప్పి బాధ ఇంకా తగ్గనప్పటికీ మాత్రి సదన్‌కు వెళ్లి అగర్వాల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశంలోని నదులను కాపాడుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.