Pawan Kalyan: రేపు విజయవాడ పర్యటనకు పవన్ కల్యాణ్.. పార్టీ నేతలతో కీలక సమావేశం
Pawan Kalyan: రేపు విజయవాడ పర్యటనకు పవన్ కల్యాణ్.. పార్టీ నేతలతో కీలక సమావేశం
Pawan Kalyan Vijayawada Tour: ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ దూకుడు పెంచనున్నారు. రేపు విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. పార్టీ నేతలతో కీల సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ దూకుడు పెంచనున్నారు. రేపు విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. పార్టీ నేతలతో కీల సమావేశం నిర్వహించనున్నారు.
2/ 4
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జులై 6న విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం ఇంట్లోనే ఉంటారు. జులై 7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
3/ 4
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.
4/ 4
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ పర్యటన నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం కానున్నారు.