జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా ప్రజాజీవితానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడంతో జనసేన పార్టీలో ఒకింత స్తబ్దత నెలకొంది. (ఫైల్)
2/ 9
తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ముందు పవన్ కు కరోనా సోకింది. తన ఫామ్ హౌస్ లోనే చికిత్స తీసుకున్న ఆయన రెండు వారాల తర్వాత కోలుకున్నారు.
3/ 9
ఐతే ఆ తర్వాత కూడా విశ్రాంతి కోసం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సినిమా షూటింగులకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు.
4/ 9
రాజకీయ అంశాలు, ఇతర సమస్యలకు సంబంధించి ప్రెస్ నోట్లకే పరమితమైన పవన్ కనీసం పార్టీకి సంబంధించి ఆన్ లైన్ సమావేశాలు కూడా నిర్వహించలేదు.
5/ 9
పవన్ కనిపించకపోవడంతో మూడు నెలల పాటు జనసేన కార్యక్రమాలు పెద్దగా జరగలేదు.
6/ 9
ఐతే త్వరలోనే జనసేనాని రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ వారం రోజుల్లో పవన్ కల్యాణ్ ఏపీకి రానున్నట్లు సమాచారం.
7/ 9
ప్రజాసమస్యలు, కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పార్టీ తరపున పోరాడాల్సిన అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
8/ 9
అలాగే పార్టీ బలోపేతంపైనా నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశమున్నట్లు సమాచారం. పవన్ వస్తున్నారన్న వార్తలతో జనసేన కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
9/ 9
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు.